APSRTC: ఏపీఎస్ ఆర్టీసీ మరో నిర్ణయం.. త్వరలోనే డ్రైవింగ్ స్కూళ్ల ఏర్పాటు!

  • కరోనాతో ఏపీఎస్ ఆర్టీసీకి మరిన్ని కష్టాలు
  • పరిమిత సంఖ్యలో బస్సులు నడిపినా తప్పని నష్టాలు
  • కారు నుంచి పెద్ద వాహనాల వరకు డ్రైవింగ్ నేర్పించేందుకు ప్రణాళికలు
APSRTC to start driving schools

అసలే ఎప్పుడూ నష్టాల్లో ఉండే ఏపీఎస్ ఆర్టీసీ... కరోనా మహమ్మారి కారణంగా మరింత నష్టాల్లోకి జారుకుంది. కొంత మేర ఆదాయాన్ని సంపాదించాలనే యోచనతో పరిమిత సంఖ్యలో ఆర్టీసీ బస్సులను నడిపింది. అయితే, కరోనా భయాలతో ప్రయాణికులు బస్సులు ఎక్కేందుకు మొగ్గుచూపలేదు. దీంతో, మళ్లీ నష్టాలే మిగిలాయి. ఈ నేపథ్యంలో ఆదాయాన్ని పెంచుకోవడానికి ఆర్టీసీ కొత్త నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవింగ్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

ఈ డ్రైవింగ్ స్కూళ్లలో కార్ల నుంచి భారీ వాహనాల వరకు శిక్షణ ఇచ్చేందుకు కసరత్తును ప్రారంభించింది. శిక్షణ కాలం 40 రోజులు ఉండేలా ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో 10 రోజులు థియరీ, 30 రోజులు ప్రాక్టికల్స్ ఉండేలా ప్రణాళిక తయారు చేస్తోంది. ఫీజులకు సంబంధించి ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. మరోవైపు, ఆదాయాన్ని పెంచుకోవడానికి ఆర్టీసీ ఇప్పటికే కార్గో సేవలను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

More Telugu News