మరో పిరీడ్ డ్రామాలో సాయిపల్లవి!

15-07-2020 Wed 21:21
  • రాశి కంటే వాసికి ప్రాధాన్యమిచ్చే సాయిపల్లవి 
  • ప్రస్తుతం చేతిలో 'లవ్ స్టోరీ', 'విరాటపర్వం'
  • వేణు ఊడుగుల చెప్పిన మరో కథకు మొగ్గు
Sai Pallavi to give nod for another period drama

కథానాయిక సాయిపల్లవి స్టయిలే వేరు. రాశి కంటే వాసికి ప్రాధాన్యమిచ్చే ఆర్టిస్టు తను. కథ, తన పాత్ర ఆమెకు బాగా నచ్చాలి. ఏదో మామూలు కమర్షియల్ సినిమాలో గ్లామర్ పాత్ర అంటే తను చేయదు. ఏమాత్రం మొహమాటం లేకుండా, మొహం మీదే సారీ చెప్పేస్తుంది. ఆ విధంగా ఈమధ్య కాలంలో ఆమె వదిలేసిన సినిమాలు ఎన్నో వున్నాయి. అందుకే, తను ఎన్ని సినిమాలు చేశానని లెక్కపెట్టుకోదు. తృప్తినిచ్చే సినిమాలు ఎన్ని చేశానన్నదే లెక్కపెట్టుకుంటుంది.

ఇక విషయంలోకి వస్తే, ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ', వేణు ఊడుగుల దర్శకత్వంలో 'విరాటపర్వం 1992' (పిరీడ్ ఫిలిం) చిత్రాలు చేస్తోంది. ఇదే సమయంలో ఆమె మరో సినిమా అంగీకరించేలా కనిపిస్తోంది. 'విరాటపర్వం' దర్శకుడు వేణు ఇటీవల మరో పిరీడ్ డ్రామా కథను ఆమెకు చెప్పాడట. అది ఆమెకు నచ్చిందనీ, దాంతో సానుకూలంగా స్పందించిందనీ అంటున్నారు. త్వరలోనే ఆమె దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వచ్చని భావిస్తున్నారు.