సత్తిగాని సత్తా ఏందో చూపిస్తా: సాక్షి టీవీలో బిత్తిరి సత్తి

15-07-2020 Wed 21:02
  • ఇటీవలే టీవీ9కి రాజీనామా చేసిన బిత్తిరి సత్తి
  • సాక్షిటీవీలో చేరిన సత్తి
  • ప్రోమో విడుదల చేసిన సాక్షి చానల్
Bithiri Sathi joined Sakshi TV

వీ6 చానల్ లో 'తీన్మార్', ఆ తర్వాత టీవీ9లో 'ఇస్మార్ట్ న్యూస్' కామెడీ షోలతో ప్రేక్షకులను బిత్తిరి సత్తి అలరించాడు. అయితే, కొన్ని కారణాల వల్ల టీవీ9కు రాజీనామా చేశాడు. ఇప్పుడు సాక్షి టీవీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందులో కూడా సెటైరికల్ కామెడీ షోను చేయబోతున్నాడు. సాక్షి టీవీలో తాను పని చేయబోతున్నట్టు ఓ ప్రోమో ద్వారా సత్తి తెలిపాడు. రావాల్సిన చోటుకే వచ్చానని... ఇకపై సత్తా  చూపిస్తానని సత్తి చెప్పడం ప్రోమోలో ఉంది.