సిటీ నుంచి ఫాంహౌస్ కు షిఫ్ట్ అయిన రాజమౌళి

15-07-2020 Wed 14:06
  • షూటింగులపై కరోనా ప్రభావం
  • ప్రభుత్వ అనుమతులు ఉన్నప్పటికీ.. పట్టాలెక్కని షూటింగులు
  • నార్కట్ పల్లి సమీపంలోని ఫాంహౌస్ కు వెళ్లిపోయిన రాజమౌళి
Director Rajamouli shifts to his farm house

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవగణ్, అలియా భట్ తదితర స్టార్లతో టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి కొంత షూటింగ్ కూడా పూర్తయింది. ఈ తరుణంలో కరోనా వైరస్ పంజా విసరడంతో సినిమా చిత్రీకరణ ఆగిపోయింది. కరోనా ప్రభావం తగ్గేంత వరకు షూటింగ్ మళ్లీ ప్రారంభమయ్యే అవకాశాలు కూడా కనిపించడం లేదు. షూటింగులకు ప్రభుత్వం అనుమతించినా నటీనటులు, టెక్నీషియన్లు షూటింగుల్లో పాల్గొనడానికి సాహసించడం లేదు.

దీంతో, రాజమౌళి తన మకాంను హైదరాబాద్ సిటీ నుంచి ఫామ్ హౌస్ కు మార్చారు. నల్గొండ జిల్లా నార్కట్ పల్లికి సమీపంలోని ఎదులూరు గ్రామంలో రాజమౌళికి విశాలమైన ఫాంహౌస్ ఉంది. షూటింగులు ఇప్పట్లో ప్రారంభమయ్యే అవకాశాలు లేకపోవడంతో ఆయన తన మకాంను అక్కడకు మార్చారు. అక్కడే ఉంటూ స్క్రిప్ట్ పనులు చూసుకోనున్నారు.