కశ్మీర్‌లో బీజేపీ నాయకుడి కిడ్నాప్.. రంగంలోకి దిగిన భద్రతా బలగాలు

15-07-2020 Wed 13:39
  • వారం రోజుల్లో ఇది రెండో ఘటన
  • గతవారం బీజేపీ నాయకుడు, సోదరుడు, తండ్రిని కాల్చి చంపిన ఉగ్రవాదులు
  • ఇప్పుడు బారాముల్లాలో మునిసిపల్ కమిటీ ఉపాధ్యక్షుడి కిడ్నాప్
BJP leader Mehraj Din Mallah allegedly kidnapped

జమ్మూకశ్మీర్‌లో బీజేపీ నాయకులపై దాడులు పెరుగుతున్నాయి. ఇటీవల బాండిపొరాకు చెందిన బీజేపీ నాయకుడు షేక్ వసీం బారి, ఆయన సోదరుడు, తండ్రిని ఉగ్రవాదులు కాల్చి చంపిన ఘటన కలకలం రేపింది. గత వారం జరిగిన ఈ ఘటన నుంచి కోలుకోకముందే బారాముల్లాలో మరో బీజేపీ నాయకుడిని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. స్థానిక బీజేపీ నేత, మునిసిపల్ కమిటీ వాటర్‌గామ్ ఉపాధ్యక్షుడైన మెరాజుద్దీన్ మల్లాను ఉత్తర కశ్మీర్‌లో కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లారు. విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన భద్రతా బలగాలు మల్లా కోసం గాలింపు చేపట్టాయి.