గాంధీ భవన్‌కూ పాకిన కరోనా.. వారం రోజులపాటు మూత

15-07-2020 Wed 12:59
  • భవన్‌లో కరోనా కంట్రోల్ రూములో  పనిచేసే సిబ్బందికి కరోనా
  • కార్యాలయాన్ని మూసేయాలని నిర్ణయించిన కాంగ్రెస్
  • గాంధీ భవన్‌లో శానిటైజ్ చేస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది
Hyderabad Gandhi Bhavan Employee Infected to covid

జీహెచ్ఎంసీ పరిధిలో పెరుగుతున్న కరోనా కేసులు నగర వాసులను భయభ్రాంతులకు గురిచేస్తుండగా, తాజాగా నగరంలోని గాంధీ భవన్‌లో కరోనా కలకలం రేపింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన ఇందులోని కరోనా కంట్రోల్ రూములో పనిచేసే సిబ్బందిలో ఒకరికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో వెంటనే అప్రమత్తమైన నేతలు పార్టీని వారం రోజులపాటు మూసివేయాలని నిర్ణయించారు. సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ సిబ్బంది గాంధీభవన్‌కు చేరుకుని పరిసరాలను శానిటైజ్ చేస్తున్నారు.