ట్విట్ట‌ర్‌లో ప‌వ‌న్ కల్యాణ్ పేరును ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చి.. రికార్డులు బద్దలయ్యేలా చేసిన ఫ్యాన్స్‌

15-07-2020 Wed 12:29
  • సెప్టెంబ‌ర్ 2న పవన్‌ పుట్టినరోజు
  • అప్పుడే సోష‌ల్ మీడియాలో శుభాకాంక్షలు
  • 'హ్యాపీ బ‌ర్త్ డే ప‌వ‌న్ ‌క‌ల్యాణ్' హ్యాష్ ట్యాగ్‌ను సృష్టించిన ఫ్యాన్స్‌
  • 24 గంట‌ల్లోనే ఈ హ్యాష్ ట్యాగ్‌తో 27.3 మిలియ‌న్ల ట్వీట్లు
pawan name on trending in twitter

సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టిన రోజుకి ఇంకా చాలా రోజుల సమయం ఉండగా ఆ పండుగ కోసం ఆయన అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. సెప్టెంబ‌ర్ 2న ఆయన పుట్టిన‌ రోజు వేడుక జరుపుకోనున్న నేపథ్యంలో అభిమానులు మాత్రం అప్పుడే సోష‌ల్ మీడియాలో '#AdvanceHBDPawanKalyan' హ్యాష్ ట్యాగ్‌ను సృష్టించారు.

ఈ హ్యాష్‌ ట్యాగ్ జత చేస్తూ పోటీలు పడి అభిమానులు పోస్టులు చేస్తుండడం ట్విట్ట‌ర్‌ ట్రెండింగ్‌లో ఇది రికార్డు సృష్టించింది. కేవలం 24 గంట‌ల్లోనే ఈ హ్యాష్ ట్యాగ్‌తో 27.3 మిలియ‌న్ల ట్వీట్లు వ‌చ్చాయి. పవన్ అభిమానులు ప్రతి ఏడాది ఇలాగే చేస్తారు. తమ ట్వీట్లు టాప్‌ ట్రెండింగ్‌లోకి వచ్చే వరకు ట్వీట్లు చేస్తారు.

ఇటీవల జూనియర్ ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు కూడా ఇదే విధంగా లక్షలాది ట్వీట్లు చేసి హ్యాపీ బర్త్‌ డే ఎన్టీఆర్‌ హ్యాష్‌ ట్యాగ్‌ను టాప్‌ ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చారు. అన్ని రికార్డులను బద్దలు కొడుతూ పవన్ అభిమానులు '#AdvanceHBDPawanKalyan' హ్యాష్ ట్యాగ్‌ను టాప్‌కి తీసుకొచ్చారు.