Power Star: 'పవర్ స్టార్' హీరోని పొగిడేస్తున్న రాంగోపాల్ వర్మ!

Power Star Most Powerful than any Star
  • రాజకీయాల్లో విఫలమైన నటుడి కథతో చిత్రం
  • ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో త్వరలో విడుదల
  • ఇంకా పలు చిత్రాలను రూపొందిస్తున్న వర్మ
రాజకీయాల్లో విఫలమైన ఓ సినిమా స్టార్ ఇతివృత్తంతో ఎవరినీ ఉద్దేశించకుండా తాను 'పవర్ స్టార్' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నానని ఇప్పటికే చెప్పిన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, తన చిత్రానికి సంబంధించిన మరో స్టిల్ ను ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేశారు.

ఈ చిత్రంలో లీడ్ రోల్ లో నటిస్తున్న వ్యక్తి తదేకంగా ఆకాశంలోకి చూస్తున్న ఫోటోను పోస్ట్ చేసిన వర్మ, "ది హీరో ఆఫ్ పవర్ స్టార్ ఈజ్ ఫెంటాస్టిక్ యాక్టర్ మోర్ పవర్ ఫుల్ దాన్ ఎనీ స్టార్ ( పవర్ స్టార్ చిత్రంలోని హీరో మిగతా స్టార్ల కన్నా శక్తిమంతమైన అద్భుతమైన నటుడు)" అని కామెంట్ పెట్టారు. కాగా, ఈ చిత్రం షూటింగ్ ను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. వీటితో పాటు మర్డర్, కరోనా వైరస్, ది మ్యాన్ హూ కిల్డ్ గాంధీ, కిడ్నాప్ ఆఫ్ కత్రినా కైఫ్ తదితర చిత్రాలను కూడా ఆయన తెరకెక్కిస్తున్నారు.
Power Star
Ram Gopal Varma
Twitter

More Telugu News