భారత్ లో మానవులపై కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు మొదలయ్యాయి: ఐసీఎంఆర్
- భారత్ బయోటెక్, జైడస్ కాడిలా సంస్థలకు అనుమతి
- క్లినికల్ ట్రయల్స్ లో 1000 మందిపై ప్రయోగాలు
- ఫలితాలపై విపరీతమైన ఆసక్తి
తాజాగా దీనిపై భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) స్పందించింది. భారత్ లో మానవులపై కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ మొదలయ్యాయని వెల్లడించింది. ఓ వ్యాక్సిన్ తయారీకి అత్యంత కీలకంగా భావించే ఈ ప్రక్రియలో దాదాపు 1000 మంది పాల్గొంటున్నారని తెలిపింది.
రెండు దశల్లో జరిగే ఈ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలపై భారత్ మాత్రమే కాదు, యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. భారత్ లో కరోనా వ్యాక్సిన్ కోసం అనేక పరిశోధనలు జరిగినా, ఇప్పటివరకు ఆశించిన పురోగతి చూపించింది భారత్ బయోటెక్, జైడస్ కాడిలా మాత్రమే. దాంతో ఈ రెండింటికే క్లినికల్ ట్రయల్స్ కు అనుమతి ఇచ్చారు.