రాజస్థాన్ రాజకీయ సునామీ.. అన్ని పదవుల నుంచి తొలగించడంపై సచిన్ పైలట్ స్పందన!

14-07-2020 Tue 15:30
  • డిప్యూటీ సీఎం, పీసీసీ పదవుల నుంచి సచిన్ తొలగింపు
  • నిజాన్ని ఓడించలేరని సచిన్ ట్వీట్
  • సాయంత్రం తన కార్యాచరణను ప్రకటించే అవకాశం
Sachin Pilot In Tweet Reacts To Being Sacked By Congress

రాజస్థాన్ రాజకీయాలు ఉత్కంఠభరిత మలుపులు తిరుగుతున్నాయి. పార్టీ అధిష్ఠానాన్ని ధిక్కరించి, సొంత ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన సచిన్ పైలట్ ను డిప్యూటీ సీఎం సహా ఇతర అన్ని పదవుల నుంచి కాంగ్రెస్ హైకమాండ్ తొలగించింది. ఇది జరిగిన వెంటనే సచిన్ పైలట్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'సత్యాన్ని వక్రీకరించగలరేమో కానీ.. దాన్ని ఓడించలేరు' అని ఆయన ట్వీట్ చేశారు.

మరోవైపు సచిన్ కు బీజేపీ నుంచి ఆహ్వానం అందే అవకాశాలు ఉన్నాయి. ఈ సాయంత్రంలోపు తన భవిష్యత్ కార్యాచరణపై ఆయన స్పష్టమైన ప్రకటన చేసే  అవకాశం ఉంది. మరోవైపు పీసీసీ పదవి నుంచి సచిన్ ను తొలగించిన వెంటనే ఆయన స్థానంలో గోవింద్ సింగ్ దోతస్త్రాను నియమించారు.