Chandrababu: అనంత పద్మనాభస్వామి ఆలయ వ్యవహారంలో సుప్రీం తీర్పు ఇక్కడ వైసీపీ సర్కారుకు కనువిప్పు కావాలి: చంద్రబాబు

  • ట్రావెన్ కోర్ ఆలయ హక్కులపై సుప్రీం కీలక తీర్పు
  • ఈ తీర్పును ఏపీ సర్కారు గమనించాలని చంద్రబాబు సూచన
  • ట్రస్టుల వ్యవహారాల్లో కలుగజేసుకోవద్దంటూ సీఎంకు హితవు
Chandrababu says CM Jagan must not meddle with trusts

కేరళలో శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయ పాలన హక్కులను ట్రావెన్ కోర్ రాజ కుటుంబ వారసులకే అప్పగిస్తూ సుప్రీం కోర్టు చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని, ఈ తీర్పు ఏపీలో వైసీపీ సర్కారుకు కనువిప్పు కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. ట్రస్టులను నిర్వహించే రాజకుటుంబాలు ఎన్నో ఏళ్లుగా ఆచరిస్తున్న సంప్రదాయాలను, వివిధ ఒప్పందాల పవిత్రతను సుప్రీం కోర్టు తీర్పు రక్షిస్తుందని పేర్కొన్నారు.

ఈ తీర్పును ఏపీ ప్రభుత్వం తప్పనిసరిగా గమనించాలని, తమ చెడు లక్ష్యాలను నెరవేర్చుకునే క్రమంలో సింహాచలం బోర్డు, మాన్సాస్ ట్రస్టు వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని ఆపేయాలని హితవు పలికారు. ఈ ట్రస్టు సంరక్షులుగా గజపతి కుటుంబీకుల హక్కులను తప్పనిసరిగా రక్షించాలని ట్వీట్ చేశారు. చెత్త రాజకీయాలు చేసే క్రమంలో సీఎం జగన్ దేవుడికి సంబంధించిన ట్రస్టులను నడిపే కుటుంబాల వ్యవహారాల్లో కలుగజేసుకోరాదని పేర్కొన్నారు.

More Telugu News