అచ్చం మనిషిని పోలిన చేప.. వైరల్ అవుతున్న ఫొటో!

14-07-2020 Tue 15:11
  • మలేషియా జలాల్లో కనిపించే ట్రిగ్గర్ ఫిష్
  • బలమైన దవడ, పళ్లు వీటి సొంతం
  • డైవింగ్ చేసే మనుషులపై కూడా దాడి చేసే తత్వం
Sea Creature With Human Like Features Baffles Twitter

అచ్చం మనిషిని పోలిన చేప ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాని నోటిని చూస్తే అచ్చం మనిషి నోటిని చూసినట్టే ఉంది. రెండు పెదవులు, పళ్లు అచ్చం మనిషిలాగానే ఉన్నాయి. మలేషియా సముద్ర జలాల్లో ఈ చేప చిక్కింది.

ఈ చేపలను ట్రిగ్గర్ ఫిష్ అంటారని, మలేషియా చుట్టుపక్కల ఈ చేపలు సాధారణంగా కనిపిస్తాయని 'ది రక్యాత్ పోస్ట్' అనే పత్రిక తెలిపింది. నేషనల్ జాగ్రఫీ చానల్ ప్రకారం ఈ చేపల ప్రవర్తన విభిన్నంగా ఉంటుంది. సముద్ర జలాల్లోని ఇతర జాతులపై ఇవి ఉన్నట్టుండి దాడి చేస్తుంటాయి. డైవింగ్ కు వెళ్లిన మనుషులపై కూడా దాడి చేస్తాయి. తమకు ఉన్న బలమైన దవడలు, పళ్లను దాడికి ఉపయోగిస్తాయి. అవి కొరికితే డైవింగ్ సూట్లకు కూడా కన్నాలు పడతాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి ఫొటో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది.