ఐదు రూపాయల ముష్టి కోసం ఇలాంటి నికృష్టపు పనులు చేస్తూ బరితెగిస్తున్నారు: నారా లోకేశ్

14-07-2020 Tue 13:19
  • వైఎస్‌ జగన్‌ పేటీఎం బ్యాచ్  బరితెగిస్తోంది
  • ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు
  • ఫేక్ ట్వీట్లతో ఆవేశపడుతున్నారు
lokesh fires on ycp leaders

వైసీపీ నేతలపై టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. తన గురించి, తన తండ్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి గురించి సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తలు ప్రచారం చేస్తున్నారని తెలుపుతూ ఇందుకు సంబంధించిన స్క్రీన్‌ షాట్లను ఆయన పోస్ట్ చేశారు.

'వైఎస్‌ జగన్‌ పేటీఎం బ్యాచ్ ఐదు రూపాయల ముష్టి కోసం నికృష్టపు పనులు చేస్తూ బరితెగిస్తున్నారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఫేక్ ట్వీట్లతో ఆవేశపడుతున్నారు. వారు మొదలుపెట్టిన మూడు ముక్కలాటతో సాధించింది ఏంటి? మూడు ప్రాంతాల్లో ఏం అభివృద్ధి చేశావ్? ఏడాదిగా ఏం పీకావ్? అని అధినేత జగన్ రెడ్డి ని నిలదీస్తే మంచిది' అని లోకేశ్ పేర్కొన్నారు.