ఇలా వరుస ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి?: పవన్ కల్యాణ్

14-07-2020 Tue 12:41
  • విశాఖ జిల్లాలోని సంస్థల్లో వరుసగా ప్రమాదాలు
  • పరవాడ రాంకీ ఫార్మాసిటీలో గత రాత్రి ప్రమాదం
  • ఈ ప్రమాదం భయభ్రాంతులకు గురిచేసింది 
  • భద్రతా ప్రమాణాలు ఎందుకు పాటించడం లేదు?  
pawan kalyan expresses concern on vizag fire accidents

విశాఖ జిల్లాలోని సంస్థల్లో వరుసగా చోటు చేసుకుంటున్న ప్రమాదాల పట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. పరవాడ రాంకీ ఫార్మాసిటీలోని విశాఖ సాల్వెంట్స్‌ సంస్థలో గత రాత్రి భారీ ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే.  గాజువాక, పరవాడ కేంద్రాలుగా విస్తరించి ఉన్న పారిశ్రామిక ప్రాంతాల్లో ప్రమాదాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు.

ఇటీవల ఎల్జీ పాలిమర్స్, ఆ తర్వాత సాయినార్ ఫార్మా ప్రమాదాలు వరుసగా చోటు చేసుకుని ఇప్పుడు ఆ ఘటనలు మరవక ముందే రాంకీ ఫార్మా సిటీలోని విశాఖ సాల్వెంట్ కర్మాగారంలో సంభవించిన ప్రమాదం భయభ్రాంతులకు గురి చేసిందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఇలా వరుస ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? అని ఆయన ప్రశ్నించారు. భద్రతా ప్రమాణాలు ఎందుకు పాటించడం లేదు?  అని నిలదీశారు.