నానావతి ఆసుపత్రి నుంచి అమితాబ్‌ భావోద్వేగభరిత పోస్ట్

14-07-2020 Tue 12:24
  • ముంబైలోని నానావతి ఆసుపత్రిలో కరోనాకు చికిత్స
  • త‌న‌పై  ప్రేమ‌ కురిపిస్తోన్న వారికి  న‌మ‌స్క‌రిస్తున్నట్లు ఫొటో
  • ప్రార్థనలు చేస్తోన్న అభిమానులకి కృతజ్ఞతలు
  • కుండ‌పోత వ‌ర్షంలా అభిమానులు ప్రేమ కురిపిస్తున్నారని వ్యాఖ్య
amitab message to fans

బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్‌ కరోనా బారిన పడి ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోన్న విషయం తెలిసిందే.  వైద్యం తీసుకుంటోన్న ఆ ఆసుపత్రి నుంచి ఆయన తన అభిమానులకు ఓ సందేశం ఇచ్చారు. త‌న‌పై కొండంత ప్రేమ‌ కురిపిస్తోన్న వారికి  న‌మ‌స్క‌రిస్తున్నట్లు  ఇన్‌స్టాగ్రాములో ఓ ఫొటో పోస్ట్ చేశారు.

తనతో పాటు, అభిషేక్, ఐశ్వర్యరాయ్, ఆరాధ్యల కోసం ప్రార్థనలు చేస్తోన్న అభిమానులకి కృతజ్ఞతలు చెబుతున్నట్లు అమితాబ్‌ పేర్కొన్నారు. కుండ‌పోత వ‌ర్షంలా అభిమానులు కురిపిస్తున్న ప్రేమ వ‌ర్షం అన్ని క్లిష్టమైన అడ్డుగోడ‌ల‌ని కూడా బద్దలు కొడుతోందని చెప్పారు. అభిమానుల అపార‌మైన ప్రేమ‌లో తాను పూర్తిగా త‌డిసిపోయానని పేర్కొన్నారు. తాను ప్రస్తుతం చీక‌టిలో ఉన్నప్పటికీ ప్ర‌కాశిస్తూనే ఉన్నానని చెప్పారు. అందరికీ శిర‌స్సు వంచి న‌మ‌స్క‌రిస్తున్నానని చెప్పారు.