'థ్రిల్లర్' మూవీలో యాక్టర్స్ వీళ్లే: వర్మ

14-07-2020 Tue 12:17
  • వరుస చిత్రాలతో హోరెత్తిస్తున్న వర్మ
  • తాజాగా 'థ్రిల్లర్' సినిమా ఫొటోలను విడుదల చేసిన ఆర్జీవీ
  • ఒడిశాలో నేను కనుగొన్న సరికొత్త టాలెంట్ అని ట్వీట్
Ram Gopa Varma releases Thiller Movie hot Pics

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ టాలీవుడ్ ను షేక్ చేస్తున్నారు. వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. అడల్ట్ కంటెంట్ మూవీలతో జనాలకు షాకిస్తున్నారు. 'క్లైమాక్స్', 'నేకెడ్' చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులు నోరెళ్లబెట్టేలా చేసిన వర్మ... ఇప్పుడు '12'ఓ క్లాక్', 'థ్రిల్లర్', 'పవర్ స్టార్' చిత్రాలతో బిజీగా ఉన్నారు. తాజాగా 'థ్రిల్లర్' చిత్రానికి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్ ద్వారా వర్మ విడుదల చేశారు.

ఈ చిత్రంలో అప్సరా రాణి, రాక్ లు జంటగా నటిస్తున్నారు. వీరిద్దరూ ఒడిశాకు చెందిన వారేనని వర్మ ట్విట్టర్ ద్వారా తెలిపారు. తనకు ఒడిశా గురించి బాగా తెలుసని... ఇప్పుడు ఒడిశాలోని సరికొత్త టాలెంట్ ను కనుగొన్నానని చెప్పారు. ఈ ఫొటోలను సూపర్ టాలెంటెడ్ నవీన్ కల్యాణ్ తీశాడని తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించి పలు ఫొటోలను వర్మ వరుసగా షేర్ చేశారు.