Devineni Uma: ప్రైవేటు అప్పు ప్రయత్నాల్లో మతలబేంటి? ఆ విదేశీట్రస్ట్ ఎవరిది?: దేవినేని ఉమ

  • ఏడాదిలో లక్షకోట్ల రూపాయల అప్పు
  • ప్రభుత్వ భూముల అమ్మకం అభివృద్ధి నిల్
  • దేశం దాటి వేలకోట్ల రూపాయల ప్రైవేటు అప్పు
  • వేలకోట్ల అప్పెందుకో ప్రజలకుచెప్పండి  
devineni fires on ycp

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు తీవ్ర విమర్శలు గుప్పించారు. 'ఏడాదిలో లక్షకోట్ల రూపాయల అప్పు, ప్రభుత్వ భూముల అమ్మకం, అభివృద్ధి నిల్, నాబార్డ్,ఆర్బీఐ, విదేశీ ఆర్థిక సంస్థల ద్వారా కాకుండా దేశందాటి వేలకోట్ల రూపాయల ప్రైవేటు అప్పు ప్రయత్నాలలో మతలబేంటి? ఆ విదేశీట్రస్ట్ ఎవరిది? కేంద్ర, రాష్ట్ర చట్టాల పరిధిదాటి మీరడుగుతున్న వేల కోట్ల అప్పెందుకో ప్రజలకు చెప్పండి జగన్‌ గారు' అని ఆయన నిలదీశారు.

కాగా, 'దేశం దాటి అప్పులు' అంటూ ఓ దినపత్రికలో వచ్చిన కథనాన్ని ఈ సందర్భంగా దేవినేని ఉమ పోస్ట్ చేశారు. ప్రైవేటు రుణాల కోసం ఏపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని అందులో పేర్కొన్నారు. అప్పుగా తెచ్చుకున్న ఈ మొత్తాన్ని రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు, వైద్య కాలేజీల నిర్మాణం వంటి పనులకోసం ఉపయోగిస్తారని ఆ కథనంలో తెలిపారు. ఈ మేరకు అనుమతులు ఇవ్వాలని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి అధ్యక్షతన ఓ బృందం ఢిల్లీ వెళ్లి కేంద్ర ఆర్థికమంత్రిని కలిసిందని ఆ పత్రికలో పేర్కొన్నారు. అమెరికాలోని ఓ ప్రైవేటు ట్రస్టు తమ ప్రభుత్వానికి రూ.7500 కోట్ల రుణం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని వారు కేంద్ర ప్రభుత్వానికి తెలిపినట్లు అందులో ఉంది.

More Telugu News