సుశాంత్ సింగ్‌ కేసు విచారణ ప్రక్రియకు ముగింపు పలికేందుకు అధికారుల నిర్ణయం

14-07-2020 Tue 11:03
  • సుశాంత్ ఆత్మహత్య కేసులో విచారణ పూర్తి? 
  • దాదాపు 35 మందిని ప్రశ్నించిన పోలీసులు 
  • స‌మగ్ర నివేదిక‌ను రూపొందిస్తున్న అధికారులు
sushant case will be closed by police

ఇటీవల బాలీవుడ్‌ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య సంచలనం సృష్టించింది. సినీ పరిశ్రమలో ఉన్న బంధుప్రీతి వల్లే తీవ్ర ఒత్తిడికి గురై ఆయన ఈ నిర్ణయం తీసుకున్నా‌డని ఎన్నో విమర్శలు వచ్చాయి. ఈ కేసులో విచారణ కొనసాగిస్తోన్న దర్యాప్తు బృందంలోని అధికారులు దాదాపు 35 మందిని ప్రశ్నించారు.

ఈ కేసులో సుశాంత్ సింగ్‌ కుటుంబ సభ్యులతో పాటు ఆయన స‌న్నిహితులు, సినీ పరిశ్రమలోని కొందరిని అధికారులు విచారించారు. సుశాంత్‌ సింగ్‌ గదిలోని వస్తువులనూ స్వాధీనం చేసుకుని విచారణ కొనసాగించారు. ఈ కేసులో విచార‌ణ ప్ర‌క్రియ‌ను ఇక ముగించాలని అధికారులు భావిస్తున్న‌ట్లు సమాచారం.

ఇప్పటివరకు చేసిన విచార‌ణ‌లో ఆత్మహత్యకు సంబంధించిన ఎటువంటి విష‌యాలు బ‌య‌ట‌కు రాలేద‌ని పోలీసులు చెబుతున్నారు. సుశాంత్‌ మరణంపై స‌మగ్ర నివేదిక‌ను రూపొందిస్తున్నామ‌న్నారు. దీన్ని మరికొన్ని రోజుల్లో వారు ఉన్న‌తాధికారుల‌కి అప్ప‌గించి కేసును ముగించనున్నట్లు తెలిసింది.