కొత్తకథతో బన్నీని మెప్పించిన దర్శకుడు!

14-07-2020 Tue 10:42
  • బన్నీకి కథ చెప్పిన 'యాత్ర' దర్శకుడు 
  • పూర్తి స్క్రిప్ట్ తో రమ్మన్న బన్నీ
  • 'పుష్ప' తర్వాత పట్టాలెక్కే అవకాశం  
Mahi Raghava approached Allu Arjun

వినూత్నమైన పవర్ ఫుల్ సబ్జెక్టు తయారుచేసుకుని వెళితే, ఈవేళ స్టార్ హీరోలు సైతం ఏ దర్శకుడికైనా అవకాశాలు ఇస్తున్నారు. అందుకే, నేటి యంగ్ డైరెక్టర్లు కొత్తతరహా కథలతో స్టార్ హీరోలను అప్రోచ్ అవుతున్నారు. ఈ క్రమంలో ఆమధ్య 'యాత్ర' పేరిట వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ను రూపొందించి పేరుతెచ్చుకున్న దర్శకుడు మహి వి రాఘవ కూడా లక్కీ ఛాన్స్ కొట్టినట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ ఇతనితో సినిమా చేయడానికి ఆసక్తిని చూపుతున్నట్టు తాజా సమాచారం.

ఇటీవల దర్శకుడు మహి ఓ కథతో బన్నీని కలిశాడనీ, ఆయనకు కథ బాగా నచ్చిందనీ అంటున్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాయింట్ కొత్తగా ఉండడంతో, పూర్తి స్క్రిప్టు తయారుచేసుకుని త్వరగా రమ్మని బన్నీ అతనికి చెప్పాడని సమాచారం. సో.. వీరి కాంబినేషన్ లో ఈ ప్రాజక్టు కార్యరూపం దాల్చే అవకాశం ఎక్కువగా వుందని అంటున్నారు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ 'పుష్ప' చిత్రాన్ని చేస్తున్నాడు. అది పూర్తయ్యాక మహి ప్రాజక్ట్ పట్టాలెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.