Mahmood Ali: తిరిగి విధుల్లో చేరిన తెలంగాణ హోంమంత్రి మహమూద్‌ అలీ

  Mahmood Ali joins in duty after recover from corona
  • రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి పోలీసులతో చర్చ
  • కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో సూచనలు
  • ప్రజలు భయాందోళనలకు గురికాకుండా చూడాలని సూచన
  • ప్రజలు రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని వ్యాఖ్య
తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ కరోనా నుంచి కోలుకుని ఇటీవలే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన విషయం తెలిసిందే. ఆయన నిన్న తిరిగి విధుల్లో చేరారు. రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి ఆయన డీజీపీతో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. అలాగే, కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు భయాందోళనలకు గురికాకుండా చూడాలని, వారిలో విశ్వాసం పెంపొందించాలని ఆయన పోలీసులకు సూచించారు.

కరోనాకు వ్యాక్సిన్ రాలేదని, రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని, ప్రజలందరూ ప్రతి రోజు అరగంట వ్యాయామం చేయాలని ఆయన సూచించారు. అందరూ పోషకాహారం తీసుకోవాలని చెప్పారు. తనకు ఆస్తమా కూడా ఉందని, ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ సోకిందని చెప్పారు. అయినప్పటికీ తాను పోషకాహారంతో పాటు అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో కరోనా నుంచి బయట పడినట్లు చెప్పారు.
Mahmood Ali
Telangana
Corona Virus

More Telugu News