Chiranjeevi: చిరంజీవి కోసం స్క్రిప్టు సిద్ధం చేసిన దర్శకుడు

Script ready for Chiranjeevi
  • ప్రస్తుతం కొరటాలతో 'ఆచార్య' చేస్తున్న చిరంజీవి  
  • సుజీత్, బాబీ, మెహర్ రమేశ్ లతో సినిమాలు
  • కమర్షియల్ హంగులతో కథ సిద్ధం చేసిన బాబీ  

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' చిత్రాన్ని చేస్తున్న చిరంజీవి తన తదుపరి చిత్రాలకు కూడా మరోపక్క ప్లానింగ్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సుజీత్, బాబి, మెహర్ రమేశ్ వంటి దర్శకులు ఆయనతో సినిమాలు చేయడానికి లైన్లో వున్నారు. ఎవరికి వారు తమ కథలను సిద్ధం చేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఏర్పడిన ఖాళీ సమయంలో చిరంజీవి వీరి కథలను వింటూ సలహాలు, సూచనలు చేస్తున్నారు. ఓపక్క సుజీత్ దర్శకత్వంలో మలయాళ సినిమా 'లూసిఫర్' చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.

ఇదే సమయంలో బాబీ కూడా తన కథను సిద్ధం చేశాడట. చిరంజీవి చేసిన సూచనల ప్రకారం పూర్తి కమర్షియల్ హంగులతో స్క్రిప్టును తయారుచేసినట్టు తెలుస్తోంది. చిరంజీవిని ప్రేక్షకులు ఏ తరహా పాత్రలో చూడాలని కోరుకుంటారో అలాంటి పాత్రతో ఈ కథను రెడీ చేశాడట. మరి, 'ఆచార్య' తర్వాత చిరంజీవి 'లూసిఫర్' రీమేక్ తో సెట్స్ కి వెళతారా? లేక బాబీ దర్శకత్వంలో సెట్స్ కి వెళతారా? అనేది త్వరలో తెలుస్తుంది. ఏమైనా, మెగాస్టార్ మాత్రం వరుస సినిమాలతో ప్రేక్షకులను రంజింపజేయడానికి రెడీ అవుతున్నారు.  

  • Loading...

More Telugu News