గల్ఫ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న తెలంగాణ వాసి

14-07-2020 Tue 08:54
  • బహ్రెయిన్‌లో నివసిస్తున్న జగిత్యాల జిల్లా వాసి
  • ఆత్మహత్యకు ముందు వాట్సాప్‌లో తల్లిదండ్రులకు సందేశం
  • ఆత్మహత్యకు తెలియరాని కారణాలు
Telanga man suicide in Bahrain

గల్ఫ్‌లో మరో తెలంగాణ వాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు తల్లిదండ్రులకు వాట్సాప్‌లో వాయిస్ రికార్డు మెసేజ్ పెట్టాడు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని వెంకటాపూర్‌కు చెందిన పిట్టల నవీన్ బహ్రెయిన్‌కు వలస వెళ్లి అక్కడే చిన్నపాటి ఉద్యోగం చేస్తున్నాడు. తాజాగా అతడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకుముందు తల్లిదండ్రులకు పంపిన వాట్సాప్ సందేశంలో వారిని బాధపడొద్దని కోరాడు. అయితే, అతడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కుమారుడి మరణవార్తను విన్న తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్నారు.