విరసం నేత వరవరరావును ఎట్టకేలకు ఆసుపత్రికి తరలించిన ప్రభుత్వం

14-07-2020 Tue 08:21
  • జైలులో క్షీణించిన వరవరరావు ఆరోగ్యం
  • కుటుంబ సభ్యులు, ప్రొఫెసర్ హరగోపాల్ వినతికి స్పందించిన ప్రభుత్వం
  • గత రాత్రి జేజే ఆసుపత్రికి తరలింపు
Virasam leader varavara rao rushed to hospital

విరసం నేత వరవరరావును మహారాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఆసుపత్రికి తరలించింది. అనారోగ్యం నుంచి వరవరరావు పూర్తిగా కోలుకునే వరకు ఆసుపత్రిలోనే ఉంచాలన్న ప్రొపెసర్ హరగోపాల్ విజ్ఞప్తిని పరిశీలించిన ప్రభుత్వం గత రాత్రి నవీముంబైలోని జేజే ఆసుపత్రికి తరలించింది.

తీవ్ర అస్వస్థతకు గురైన వరవరరావు గతంలో ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందారు. అయితే, ఆయన పూర్తిగా కోలుకోకుండానే గత నెల 1న డిశ్చార్జ్ చేశారు. జైలులో ఉన్న ఆయన ఆరోగ్యం మళ్లీ క్షీణించడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలంటూ హరగోపాల్ సహా తెలంగాణ ఫోరం, ఆయన కుటుంబ సభ్యులు చేసిన అభ్యర్థనతో ప్రభుత్వం వరవరరావును ఆసుపత్రికి తరలించింది.