సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

14-07-2020 Tue 07:27
  • అలియా భట్ అప్పుడే రాదట!
  • 'జెర్సీ' దర్శకుడితో మళ్లీ నాని
  • మహేశ్ సినిమాలో భాగ్యశ్రీ  
Aliya Bhat not ready for shoots now

*  బాలీవుడ్ నటి అలియా భట్ అప్పుడే షూటింగులలో పాల్గొనేలా లేదు. ముంబైలో కరోనా ఇంకా ఉద్ధృతంగా ఉండడంతో ఇప్పట్లో షూటింగులలో పాల్గొనకూడదని ఈ ముద్దుగుమ్మ నిర్ణయం తీసుకుందట. దాంతో వచ్చే నెల నుంచి ప్రారంభించాలనుకుంటున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రం షూటింగులో కూడా అలియా పాల్గొనే అవకాశం లేదు.  
*  గతంలో నాని హీరోగా గౌతం తిన్ననూరి దర్శకత్వంలో 'జెర్సీ' చిత్రం వచ్చిన సంగతి విదితమే. ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కలయికలో మరో చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా, నాని ప్రస్తుతం 'టక్ జగదీశ్', 'శ్యామ్ సింగ రాయ్' చిత్రాలలో నటిస్తున్నాడు.
*  'మైనే ప్యార్ కియా' చిత్రంతో ఎంతో పేరు తెచ్చుకున్న నిన్నటి తరం కథానాయిక భాగ్యశ్రీ తాజాగా మహేశ్ బాబు చిత్రంలో నటించనుంది. పరశురాం దర్శకత్వంలో మహేశ్ నటిస్తున్న 'సర్కారు వారి పాట' చిత్రంలో ఆమె హీరోకి తల్లిగా కనిపించనుందని తాజా సమాచారం.