తెలంగాణలో కొనసాగుతున్న కరోనా కేసుల ఉద్ధృతి!

13-07-2020 Mon 22:05
  • జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 926 కేసులు
  • 36 వేలు దాటిన మొత్తం కేసుల సంఖ్య
  • 365కి పెరిగిన మరణాలు
Corona cases raised constantly in Telangana

హైదరాబాదులోనూ, పరిసర ప్రాంతాల్లోనూ కరోనా రక్కసి విజృంభణకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఇవాళ కూడా భారీ సంఖ్యలో కొత్త కేసులు వచ్చాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 926 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. రంగారెడ్డి జిల్లాలో 212, కరీంనగర్ జిల్లాలో 86 కేసులు రాగా, గడచిన 24 గంటల్లో తెలంగాణ మొత్తమ్మీద 1,550 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో, రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 36 వేలు దాటింది. ఇవాళ 1,197 మంది డిశ్చార్జి కాగా, ఇంకా 12,178 చికిత్స పొందుతున్నారు. మొత్తమ్మీద 23,679 మంది కోలుకున్నారు. తాజాగా 9 మరణాలు సంభవించడంతో కరోనా మృతుల సంఖ్య 365కి పెరిగింది.