Singapore: మళ్లీ మా దేశంలో అడుగుపెట్టొద్దంటూ.. 10 మంది భారతీయులను పంపించేసిన సింగపూర్

  • సింగపూర్ లో కఠినంగా లాక్ డౌన్
  • ఓ వేడుక కోసం గుమికూడిన భారత విద్యార్థులు, ఉద్యోగులు
  • ఇది నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్న సింగపూర్ వర్గాలు
Singapore has deported ten Indian people including students

చాలా చిన్నదేశమైనా ఆర్థికంగా ఎంతో ఉన్నతస్థాయిలో ఉండే సింగపూర్ లో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. కరోనా సమయంలో ఆ చట్టాలకు మరింత పదును పెంచిన సింగపూర్, కరోనా లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కొరడా ఝుళిపిస్తోంది. తాజాగా, 10 మంది భారతీయులను తమ దేశం నుంచి పంపించివేసింది. వారందరూ కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించినట్టు తేలింది.

కరోనా వైరస్ వ్యాప్తి గొలుసును తెంచాలని తాము ఎంతో కఠినంగా అమలు చేస్తున్న లాక్ డౌన్ ను ఈ 10 మంది అతిక్రమించారని సింగపూర్ పేర్కొంది. అందుకే వారిని భారత్ కు పంపించివేస్తున్నామని, వారు మళ్లీ సింగపూర్ లో అడుగుపెట్టేందుకు అనర్హులయ్యారని అక్కడి అధికారులు వివరించారు.

సింగపూర్ ప్రభుత్వం తిప్పిపంపిన వారిలో విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నారు. లాక్ డౌన్ కొనసాగుతున్న రోజుల్లో మే 5న వీరందరూ ఓ అద్దె అపార్ట్ మెంట్ లో ఓ వేడుక చేసుకున్నారని, ఎక్కువ మంది గుమికూడారని అధికారులు చెబుతున్నారు. దేశ బహిష్కరణ శిక్ష మాత్రమే కాకుండా వారిపై నగదు జరిమానా కూడా విధించారు.

More Telugu News