Nara Lokesh: పబ్లిసిటీ పీక్స్.. విషయం వీక్... దిస్ ఈజ్ వాస్తవం: నారా లోకేశ్

  • కరోనా సేవలపై ప్రభుత్వానిది ప్రచార ఆర్భాటమేనన్న లోకేశ్
  • క్వారంటైన్ సెంటర్ల వసతులపై ఓ వ్యక్తి మాట్లాడిన వీడియో షేర్
  • శానిటైజర్లు కూడా ఇవ్వరన్న సదరు వ్యక్తి
Publicity is high and matter is weak says Nara Lokesh

కరోనా రోగులకు అందిస్తున్న వైద్యంపై వైసీపీ ప్రభుత్వానికి ప్రచార ఆర్భాటం తప్ప మరేమీ లేదని టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శించారు. 'పబ్లిసిటీ పీక్స్... విషయం వీక్.. దిస్ ఈజ్ వాస్తవం' అని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా క్వారంటైన్ సెంటర్లు ఎంత దారుణంగా ఉన్నాయో ఓ వ్యక్తి చెపుతున్న వీడియోను పోస్ట్ చేశారు. రోగిని పట్టించుకునే నాథుడు కూడా అక్కడ ఉండరని సదరు వ్యక్తి వీడియోలో తెలిపాడు. డాక్టర్లు రారని... కేవలం నర్సు, కాంపౌండర్ మాత్రమే వచ్చేవారని చెప్పాడు. ఒక పెద్ద గదిలో రోగులందరినీ వరుసగా పడుకోబెట్టేవారిని... శానిటైజర్లు కూడా ఇవ్వరని విమర్శించాడు. పశువులు కూడా తినని ఆహారాన్ని అందిస్తారని చెప్పాడు.

More Telugu News