సోషల్ మీడియాలో అమితాబ్, అభిషేక్ బచ్చన్ ల ఫొటో పోస్టు చేసిన హాలీవుడ్ నటుడు

13-07-2020 Mon 17:58
  • కరోనాతో ఆసుపత్రిపాలైన అమితాబ్, అభిషేక్
  • బచ్చన్ ఫ్యామిలీకి సంఘీభావం ప్రకటించిన జాన్ సీనా
  • భారతదేశాన్ని ఎంతో అభిమానించే సీనా
John Cena responds after Amitab and Abhishek hospitalised with corona

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్ కరోనా బారినపడి ఆసుపత్రిపాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమితాబ్ త్వరగా కోలుకోవాలంటూ సందేశాలు వెల్లువెత్తుతుతున్నాయి. హాలీవుడ్ నటుడు, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ స్టార్ రెజ్లర్ జాన్ సీనా కూడా అమితాబ్, అభిషేక్ బచ్చన్ ల ఫొటో సోషల్ మీడియాలో పోస్టు చేసి సంఘీభావం ప్రకటించారు. గతంలోనూ జాన్ సీనా ఇదే విధంగా అనేక సందర్భాల్లో భారత ప్రముఖుల ఫొటోలు పోస్టు చేస్తూ, భారతదేశంపై తన అభిమానాన్ని ప్రదర్శించేవారు. బాలీవుడ్ అన్నా, హిందీ సినీ స్టార్లన్నా జాన్ సీనాకు వల్లమాలిన అభిమానం. అతడి ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ చూస్తే ఎక్కువగా వారి ఫొటోలే దర్శనమిస్తాయి.