ఏపీలో ఒక్కరోజులో 37 మంది మృతి... మృత్యుఘంటికలు మోగిస్తున్న కరోనా

13-07-2020 Mon 17:28
  • రాష్ట్రంలో 365కి పెరిగిన కరోనా మరణాలు
  • కొత్తగా 1,935 మందికి పాజిటివ్
  • 1,030 మంది డిశ్చార్జి
Corona deaths raises in Andhra Pradesh

ఏపీలో కరోనా బీభత్సం మరింత పెరిగింది. 24 గంటల వ్యవధిలో 37 మంది మృత్యువాత పడ్డారు. అనంతపురం జిల్లాలో ఆరుగురు, కర్నూలు జిల్లాలో నలుగురు, తూర్పు గోదావరి జిల్లాలో నలుగురు, పశ్చిమ గోదావరి జిల్లాలో నలుగురు, చిత్తూరు జిల్లాలో ముగ్గురు, గుంటూరు జిల్లాలో ముగ్గురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, ప్రకాశం జిల్లాలో ముగ్గురు, కడప జిల్లాలో ఇద్దరు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు, విశాఖపట్నం జిల్లాలో ఒకరు, విజయనగరం జిల్లాలో ఒకరు మరణించినట్టు బులెటిన్ లో పేర్కొన్నారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 365కి పెరిగింది.

ఇక, కొత్తగా 1,935 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 313, కర్నూలు జిల్లాలో 249, శ్రీకాకుళం జిల్లాలో 204, గుంటూరు జిల్లాలో 191, అనంతపురం జిల్లాలో 176, చిత్తూరు జిల్లాలో 168, పశ్చిమ గోదావరి జిల్లాలో 137, కృష్ణా జిల్లాలో 111 కేసులు నమోదయ్యాయి. ఓవరాల్ గా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 31,103కి చేరింది. తాజాగా 1,030 మంది డిశ్చార్జి అయ్యారు. ఇంకా, 14,274 మంది చికిత్స పొందుతున్నారు.