Balakrishna: హిందూపురం కేంద్రంగా కొత్త జిల్లా... సీఎం జగన్ కు బాలకృష్ణ లేఖ

Hindupur MLA Balakrishna writes CM Jagan over new district
  • ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సర్కారు యోచన
  • హిందూపురం అనుకూలంగా ఉంటుందన్న బాలయ్య
  • మెడికల్ కాలేజీ కూడా నిర్మించవచ్చని వెల్లడి
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్న నేపథ్యంలో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సీఎం జగన్ కు లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రతి పార్లమెంటు స్థానాన్ని ఓ జిల్లాగా ఏర్పాటు చేయాలని వైసీపీ సర్కారు భావిస్తోంది. ఈ క్రమంలో హిందూపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలంటూ బాలకృష్ణ తన లేఖలో కోరారు. కర్ణాటక రాజధాని బెంగళూరుకు దగ్గరగా ఉండడంతో పాటు హిందూపురంకు అనేక అనుకూలతలు ఉన్నాయని తెలిపారు. ఈ విషయమై బాలయ్య సీఎం జగన్ కే కాకుండా, సీఎస్ నీలం సాహ్నీకి కూడా లేఖ రాశారు.

అటు, హిందూపురంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలంటూ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానికి లేఖ రాశారు. హిందూపురం నియోజకవర్గంలోని మలుగూరు వద్ద మెడికల్ కాలేజీ నిర్మాణానికి అనువైన స్థలం ఉందని, హిందూపురం జనాభా, ఇతర అవసరాలను పరిగణనలోకి తీసుకుని ఇక్కడ మెడికల్ కాలేజీ నిర్మించాలని కోరారు.
Balakrishna
Jagan
Letter
Hindupur
New District
Medicle College
Alla Nani
Andhra Pradesh

More Telugu News