రెడ్ లైట్ ఏరియా అమ్మాయిగా రకుల్!

13-07-2020 Mon 16:51
  • తెలుగులో దూకుడు తగ్గిన రకుల్
  • 'భారతీయుడు' సీక్వెల్ లో హీరోయిన్
  • ముంబై రెడ్ లైట్ ఏరియా వేశ్య బయోపిక్
Rakul to play prostitute

అగ్ర హీరోలందరి సరసన నటించిన కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ కి ప్రస్తుతం తెలుగులో అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. కొత్త అమ్మాయిల దూకుడుతో రకుల్ కాస్త వెనుకపడింది. ప్రస్తుతం తమిళంలో 'భారతీయుడు 2'లో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ గత కొంతకాలంగా బాలీవుడ్ పై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో తాజాగా ఓ వేశ్య పాత్రను పోషించే అవకాశం రకుల్ కి ఓ హిందీ చిత్రంలో లభించినట్టు తెలుస్తోంది.

ముంబై రెడ్ లైట్ ఏరియాకు చెందిన యువతిగా ఇందులో ఆమె కనిపిస్తుంది. ఆ ఏరియాకు చెందిన ఓ ప్రముఖ వేశ్య నిజ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారట. ఆమధ్య తాను హిందీలో చేసిన 'మార్జవాన్'లో కూడా రకుల్ వేశ్య పాత్రనే పోషించి గ్లామర్ కురిపించింది. ఇప్పుడు మళ్లీ అదే తరహా పాత్ర చేయడానికి కారణం, ఈ బయోపిక్ కథ, పాత్రను మలచిన తీరు ఆమెకు బాగా నచ్చడమేనట!