'పవర్ స్టార్' సినిమాలో కనిపించనున్న వర్మ?.. సినిమాకు చెందిన మరో పిక్ విడుదల!

13-07-2020 Mon 15:34
  • 'పవర్ స్టార్' వరుస ఫొటోలతో హీటెక్కిస్తున్న వర్మ
  • ఓ పార్టీ అధినేత ముందు కూర్చున్నట్టు తాజా ఫొటో
  • ఓ సినీ నిర్మాత పాత్రలో వర్మ కనిపించనున్నట్టు సమాచారం
Ram Gopal Varma playing a rore in Power Star movie

రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న 'పవర్ స్టార్' సినిమా ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు వర్మ విడుదల చేసిన ఫొటోలు కలకలం రేపుతున్నాయి. తాజాగా వర్మ మరో పిక్ ను వదిలారు. 'పవర్ స్టార్' నుంచి ఒక టెన్షన్ సన్నివేశం అని ఆయన పేర్కొన్నారు. ఒక రాజకీయ పార్టీ అధినేత ముందు కూర్చున్నట్టుగా ఫొటో ఉంది.

మరోవైపు ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో వర్మ కనిపించనున్నారట. ఆ పాత్ర పవర్ స్టార్ కు వీరాభిమానినని చెప్పుకునే ఓ నిర్మాతదని సమాచారం. అయితే, దీనికి సంబంధించిన అధికారిక సమాచారం మాత్రం ఇంకా వెల్లడికాలేదు. ఈ వార్తలో ఎంత నిజం ఉందో వేచి చూడాలి.