లడఖ్ ఘటన తర్వాత హిందూ మహాసముద్రంలోకి యుద్ధ నౌకలను పంపిన చైనా!

13-07-2020 Mon 13:17
  • ఇటీవల లడఖ్ లో భారత్-చైనా బలగాల మధ్య ఘర్షణ
  • ఇరువైపులా ప్రాణనష్టం
  • యుద్ధ సన్నాహాలు చేసిన చైనా!
China deployed war ships in Indean ocean after Ladakh clashes

ఇటీవల లడఖ్ లో భారత్-చైనా బలగాల మధ్య ఘర్షణలు జరిగి పదుల సంఖ్యలో ఇరువైపులా సైనికులు మృతి చెందారు. ఈ ఘటనలో చైనా సైనికులే ఎక్కువమంది చనిపోయారన్న వార్తల నేపథ్యంలో డ్రాగన్ యుద్ధ సన్నాహాలు చేసిందని భారత నేవీ అధికారి ఒకరు తెలిపారు. లడఖ్ ఘటన అనంతరం చైనా హిందూ మహాసముద్రంలోకి 6 యుద్ధ నౌకలను పంపిందని వెల్లడించారు. భారత నావికాదళం వెంటనే స్పందించి వాటిపై నిఘా వేసిందని, దాంతో 3 చైనా యుద్ధనౌకలు అప్పటికప్పుడు వెనుదిరిగి వెళ్లిపోయాయని, మరో మూడు ఆ తర్వాత వెళ్లిపోయాయని వివరించారు.