వీరు పోట్ల దర్శకత్వంలో అఖిల్?

13-07-2020 Mon 12:55
  • హీరోగా ఇంకా హిట్టు కొట్టని అఖిల్ 
  • త్వరలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'
  • తదుపరి చిత్రానికి లైన్ ఓకే చేసిన అఖిల్
Akhil to work with Veeru Potla

అక్కినేని నాగార్జునకు మరో వారసుడిగా చిత్రరంగ ప్రవేశం చేసిన అఖిల్ అక్కినేని ఇంకా సరైన లైన్లో పడలేదు. హీరోగా ఇప్పటికి మూడు సినిమాలు చేశాడు. అయినా, ఒక్కటీ హిట్టవలేదు. దాంతో మంచి ఇంట్రడక్షన్ ఉన్నప్పటికీ, హీరోగా ఇంకా ట్రాక్ లో పడలేకపోయాడు. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' అనే చిత్రాన్ని చేస్తున్నాడు. త్వరలో విడుదలకు రెడీ అవుతున్న ఈ సినిమా తనకు హీరోగా ఓ మంచి సక్సెస్ ను ఇస్తుందని ఆశలు పెట్టుకున్నాడు.

ఇదిలావుంచితే, 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' పూర్తవుతుండడంతో మరో సినిమాకు అఖిల్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగా పలు కథలు వింటున్నాడు. ఈ క్రమంలో తాజాగా దర్శకుడు వీరు పోట్ల చెప్పిన కథ లైన్ అఖిల్ కి బాగా నచ్చిందట. దాంతో స్క్రిప్టు మొత్తం రెడీ చేయమని అడిగినట్టు సమాచారం.