పబ్‌జీ గేమ్‌కు బలైపోయిన చిత్తూరు జిల్లాకి చెందిన బాలుడు

13-07-2020 Mon 12:12
  • పలమనేరు శ్రీనగర్ కాలనీలో ఘటన
  • పబ్‌జీ గేమ్‌కు బానిసైన పదో తరగతి బాలుడు
  • తల్లిదండ్రులు మందలించడంతో ఆత్మహత్య
boy commits suicide in chittoor

ఆన్‌లైన్ గేమ్‌ పబ్‌జీకి మరో బాలుడు బలయ్యాడు. పదేపదే పబ్‌జీ ఆడుతోన్న చిత్తూరు జిల్లా పలమనేరు శ్రీనగర్ కాలనీకి చెందిన  శ్యామ్ ప్రసాద్ (14) అనే బాలుడిని అతడి తల్లిదండ్రులు మందలించారు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు శ్యామ్‌ ఉరి వేసుకున్నాడు.

ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించి, బాలుడిని పలమనేరు ఆసుపత్రికి తీసుకు వెళ్తున్న సమయంలో మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఆ బాలుడు స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడని స్థానికులు చెప్పారు. తన తండ్రి మొబైల్ ఫోన్‌ను తీసుకుని రోజంతా పబ్‌జీ ఆడేవాడని, దీంతో చదువును నిర్లక్ష్యం చేస్తున్నాడని తల్లిదండ్రులు కోప్పడ్డారని తెలిపారు.