కిట్టన్నా... ఏమిటీ రాతలు?: విజయసాయి రెడ్డి

13-07-2020 Mon 11:04
  • మీ భాగస్వామి చంద్రబాబు సీఎం కాదు
  • మీ రాతలు హ్యారీ పోటర్ ముందు దిగదుడుపే
  • ట్విట్టర్ లో విజయసాయి రెడ్డి విసుర్లు
Vijaya Sai Reddy Setires on Yanamala

ముఖ్యమంత్రి కార్యాలయంలో ఎవరు ఉండాలో చెప్పేందుకు మీ భాగస్వామి చంద్రబాబు ఇప్పుడు సీఎంగా లేడని ఎవరి పేరునూ నేరుగా ప్రస్తావించకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "ఏమి ఊహాజనిత రాతలు కిట్టన్నా ? నీ కాల్పనిక కథల దెబ్బకు హ్యారీపోటర్ సిరీస్ మరుగున పడిపోతోంది. అధికారులకు శాఖల కేటాయింపు పైనా కులం కార్డునే ప్రయోగిస్తున్నావ్. సీఎం పేషీలో ఎవరుండాలో నిర్ణయించడానికి తమరి పార్టనర్ చంద్రబాబు ముఖ్యమంత్రి అనుకున్నావా?" అని ప్రశ్నించారు.