భాగ్యనగరిలో కరోనా లెక్క... గంటకు 49 మందికి కరోనా పాజిటివ్!

13-07-2020 Mon 10:39
  • రోజుకు సగటున 1,169 కేసులు
  • తీవ్రత తగ్గినా అధికంగానే కేసులు
  • గత 13 రోజుల్లో 14 వేలకు పైగా కొత్త కేసులు
49 New Cases per Hour in Hyderabad

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కరోనా శరవేగంగా విజృంభిస్తోంది. ప్రతి గంట వ్యవధిలో కొత్తగా 49 మంది వైరస్ బారిన పడుతున్నారు. అంటే రోజులో సగటున 1169 కేసులు ఒక్క హైదరాబాద్ పరిధిలోనే వస్తున్నాయి. వాస్తవానికి ఈ నెల ప్రారంభంలో ఉన్న తీవ్రత ఇప్పుడు కనిపించకపోయినా, కొత్త కేసుల సంఖ్య అధికంగానే ఉందని ఆరోగ్య నిపుణులు వ్యాఖ్యానించారు. ఈ నెల 3 నుంచి 8 మధ్య రోజుకు 1,270 నుంచి 1,660 వరకూ కేసులు రాగా, ఆపై మాత్రం రోజుకు 1,000 కేసుల లోపే వస్తున్నాయి. తొలివారంలో రికార్డు స్థాయిలో నమోదైన కేసుల వేగం, ఇప్పుడు దాదాపు సగానికి తగ్గింది. మొత్తం మీద గత 13 రోజుల్లో ఏకంగా 14,033 కేసులు వచ్చాయి. దీంతో అధికారులు మరింత అప్రమత్తమై, కంటెయిన్ మెంట్ జోన్లలో ఆంక్షలను పెంచారు.