కరోనాకు బలైన హైదరాబాద్ కాంగ్రెస్ నేత జి.నరేందర్ యాదవ్

13-07-2020 Mon 10:29
  • యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • కరోనా బాధితుల సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న నరేందర్
  • విషాదంలో కాంగ్రెస్ శ్రేణులు
Hyderabad congress leader G Narender Yadav died with corona

కరోనా మహమ్మారి బారినపడిన హైదరాబాద్‌కు చెందిన కాంగ్రెస్ నేత జి.నరేందర్ యాదవ్ పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం మృతి చెందారు. ఆయన మృతితో కాంగ్రెస్ వర్గాల్లో కలకలం మొదలైంది. కరోనా బాధితుల సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయనలో లక్షణాలు కనిపించడంతో వెంటనే పరీక్ష చేయించుకోగా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో ఆయన చికిత్స కోసం యశోద ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతుండగానే పరిస్థితి విషమించడంతో ప్రాణాలొదిలారు. ఆయన మృతితో కాంగ్రెస్ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి. నరేందర్ యాదవ్ ఇటీవల గాంధీభవన్‌లో జరిగిన అన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. దీంతో అవే కార్యక్రమాలకు హాజరైన నేతలు, కార్యకర్తల్లో భయం మొదలైంది.