ఒకప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఈ విషయం చెప్పారు: నాగబాబు

13-07-2020 Mon 10:24
  • మన కంటికి కనబడేది ఏదయినా ఎవరో ఒకరు క్రియేట్ చేసిందే
  • లేకపోతే ఆ వస్తువుకి ఉనికి ఉండదని అన్నారు
  • మరి అంత క్రియేట్‌ చేసిన దేవుడిని క్రియేట్ చేసింది ఎవరు?
  • శక్తి ఉనికిలో ఉందంటే ఒక క్రియేటింగ్ రీజన్ వేరే ఉండాలి 
nagababu about god

దేవుడి కాన్సెప్ట్‌ గురించి సినీనటుడు, జనసేన నేత నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ఒకప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు చెప్పారు.. అది ఏంటంటే మన కంటికి కనబడేది ఏదయినా ఎవరో ఒకరు క్రియేట్ చేసిందే అయివుంటుంది. లేకపోతే ఆ వస్తువుకి ఉనికి ఉండదు. అలాగే ఇంత విశాల విశ్వం కూడా ఉనికిలో ఉందంటే ఎవరో ఒక క్రియేటర్ వుండే ఉండాలి. అతడే భగవంతుడు అని చాలా గంభీరంగా చెప్పారు' అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

'మరి అంత క్రియేట్‌ చేసిన దేవుడిని క్రియేట్ చేసింది ఎవరు? ఒక శక్తి ఉనికిలో ఉందంటే దానికి ఒక క్రియేటింగ్ రీజన్ వేరే ఉండాలి. ఆ రీజన్ దేవుడిని క్రియేట్‌ చేసి ఉండాలి. అలాగే ఆ దేవుడిని క్రియేట్ చేసిన రజన్ కి ఇంకో రీజన్ ఉండాలి. సో అలా వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే అంతు పొంతూ ఉండదు' అని నాగబాబు తెలిపారు.  

'సో.. గాడ్ అనే కాన్సెప్ట్ కి మీనింగ్ ఏదీ లేదు. కాబట్టి దేవుడి కాన్సెప్ట్‌ను ఇన్వాల్వ్ చేయకుండా జీవిద్దాం.. కానీ, చట్టాన్ని గౌరవిస్తూ బతుకుదాం' అని నాగబాబు తెలిపారు.