తన వివాహంపై ఆఫ్ఘన్ క్రికెటర్ రషీద్ ఖాన్ కామెంట్... అభిమానుల ట్రోలింగ్!

13-07-2020 Mon 08:18
  • ఐపీఎల్ లో సన్ రైజర్స్ తరఫున ఆడిన రషీద్
  • తన దేశం వరల్డ్ కప్ నెగ్గాక వివాహమని వ్యాఖ్య
  • జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండాలని అంటున్న ఫ్యాన్స్
Rashid Khan Comments on His Marriage Goes Trool

ఆఫ్ఘనిస్థాన్ స్పిన్ బౌలర్, సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ లో భాగమై, ఇండియాలో సైతం లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న రషీద్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ట్విట్టర్ లో వైరల్ కాగా, ఆయనపై ట్రోలింగ్ సైతం మొదలైంది. తాజాగా, తన దేశ అధికారిక రేడియోకు ఇంటర్వ్యూ ఇచ్చిన వేళ, పెళ్లి ఎప్పుడు చేసుకుంటారన్న ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానమే ట్రోలింగ్ కు కారణమైంది.

"నా దేశం ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ వరల్డ్ కప్ ను నెగ్గిన తరువాతనే వివాహం చేసుకుంటాను" అని రషీద్ బదులివ్వగా, ఈ ప్రశ్న, సమాధానాలు వైరల్ అయ్యాయి. అతను చేసిన వ్యాఖ్యలను పాక్ జర్నలిస్ట్ సాధిక్ ట్వీట్ చేశాడు. ఆ వెంటనే ట్రోలింగ్ మొదలయ్యాయి. వరల్డ్ కప్ గెలిచేందుకు ఇదేమీ లూడో వరల్డ్ కప్ కాదని, రషీద్ తన మాటపై నిలిస్తే జీవితాంతం బ్రహ్మచారిగా మిగిలి పోవాల్సిందేనని, జరగని పనుల గురించి మాట్లాడవద్దని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.