Andaman: తెల్లవారుజామున అండమాన్ దీవుల్లో భూకంపం!

Earth Quake in Andaman
  • గత రాత్రి 2.36 గంటలకు భూకంపం
  • డిజ్లీపూర్ కు 153 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం
  • ఆందోళన చెందుతున్న ప్రజలు
అండమాన్, నికోబార్ దీవుల్లో ఈ తెల్లవారుజామున భూకంపం వచ్చింది. రాత్రి 2.36 గంటల సమయంలో భూమి కంపించగా, ఆ సమయంలో నిద్రలో ఉన్న ప్రజలు, ఉలిక్కిపడి మేలుకుని తీవ్ర ఆందోళన చెంది, వీధుల్లోకి పరుగులు తీశారు. అండమాన్, నికోబార్ దీవుల్లోని డిజ్లీపూర్ ప్రాంతానికి ఉత్తర దిశగా 153 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని, రిక్టర్ స్కేలుపై దీని ప్రభావం 4.3గా నమోదైందని సెస్మాలజీ విభాగం పేర్కొంది. ఇదే ప్రాంతంలో గత నెల 28న కూడా భూకంపం వచ్చింది. ఇటీవలి కాలంలో అండమాన్ దీవుల్లో వరుసగా భూకంపాలు వస్తుండడంతో ప్రజలు ఆందోళనలో ఉన్నారు.
Andaman
Earth Quake

More Telugu News