సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

13-07-2020 Mon 07:37
  • వంశీ దర్శకత్వంలో చరణ్ మరో సినిమా 
  • పూరి 'ఫైటర్'లో బాలీవుడ్ నటుడు
  • పిరీడ్ నేపథ్యంలో రవితేజ సినిమా  
Ramcharan to work with Vamshi Paidipally

*  రామ్ చరణ్, వంశీ పైడిపల్లి కలయికలో గతంలో 'ఎవడు' వంటి విభిన్న కథా చిత్రం వచ్చిన సంగతి విదితమే. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రానుంది. ఈ విషయమై ఇటీవల వీరిద్దరూ కలసి చర్చించుకోవడం జరిగిందని తాజా సమాచారం.
*  విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఫైటర్' చిత్రంలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో ఆయన డాన్ గా హీరోకి తండ్రి పాత్రలో నటిస్తున్నాడట. ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలలో ఆయన పాత్ర కనిపిస్తుందని అంటున్నారు.  
*  ప్రస్తుతం 'క్రాక్' చిత్రంలో నటిస్తున్న రవితేజ దీని తర్వాత నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. ఇందులో ద్విపాత్రాభినయం చేస్తాడు. పిరీడ్ బ్యాక్ డ్రాప్ తో ఈ చిత్రం రూపొందుతుందని తెలుస్తోంది.