తెలంగాణలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి... మరో 1,269 కొత్త కేసులు

12-07-2020 Sun 21:36
  • జీహెచ్ఎంసీ పరిధిలో 800 కొత్త కేసులు
  • తాజాగా 1,563 మంది డిశ్చార్జి
  • గత 24 గంటల్లో 8 మంది మృతి
Corona cases continues to raise in Telangana

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 1,269 మందికి కరోనా నిర్ధారణ అయింది. దాంతో మొత్తం కేసుల సంఖ్య 34,671కి చేరింది. జీహెచ్ఎంసీ పరిధిలో 800 కొత్త కేసులు వచ్చాయి. ఇవాళ 1,563 మంది డిశ్చార్జి కాగా, ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 22,482కి పెరిగింది. ప్రస్తుతం 11,883 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో తాజాగా 8 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో మొత్తం మరణాలు 356కి పెరిగాయి.