మరో తెలుగు టీవీ ఆర్టిస్టుకు కరోనా పాజిటివ్

12-07-2020 Sun 21:22
  • కరోనా బారినపడిన భరద్వాజ్ రంగావజ్జుల
  • స్వాతిచినుకులు, బంధం సీరియళ్లతో ఫేమస్ అయిన భరద్వాజ్
  • తనకు లక్షణాలు లేవని వెల్లడి
Another Telugu tv artist tested corona positive

ఇటీవలే లాక్ డౌన్ ఆంక్షలు సడలించడంతో తెలుగు సినిమా, టీవీ షూటింగ్ లు కొనసాగుతున్నాయి. అయితే కరోనా వ్యాప్తి పెరిగిపోవడంతో పలువురు టీవీ నటులు కరోనా బారినపడుతున్నారు. తాజాగా తెలుగు బుల్లితెర ఆర్టిస్టు భరద్వాజ్ రంగావజ్జులకు కరోనా నిర్ధారణ అయింది.

భరద్వాజ్ తనకు కరోనా సోకిందన్న విషయాన్ని స్వయంగా వెల్లడించారు. భరద్వాజ్... స్వాతిచినుకులు, బంధం అనే టీవీ సీరియళ్ల ద్వారా ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తనకు లక్షణాలేవీ లేవని, ఆ రెండు సీరియళ్లలో తనతో పాటు నటిస్తున్న వాళ్లు ఐసోలేషన్ లో  ఉండాలని భరద్వాజ్ సూచించారు.