కారులో వెళుతున్న మహిళలే ఈ పోలీస్ టార్గెట్!

12-07-2020 Sun 19:48
  • లిఫ్ట్ అడిగి ఫోన్ నెంబర్లు సేకరిస్తున్న కానిస్టేబుల్
  • ఆపై ఫోన్ లో సందేశాలు పంపుతూ వేధింపులు
  • కొన్ని రోజుల వ్యవధిలో ఇద్దరు మహిళల నుంచి ఫిర్యాదులు
Police constable harasses women in Hyderabad

తెలంగాణ రాష్ట్ర స్పెషల్ పోలీస్ (టీఎస్ఎస్పీ) విభాగానికి చెందిన కానిస్టేబుల్ వీరబాబు తానొక బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉన్నానని మరిచి, మహిళలను వేధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. కారులో వెళుతున్న మహిళలను లిఫ్ట్ అడగడం, వారి కారులో ఎక్కి, మాట కలిపి, ఆపై ఫోన్ నెంబర్లు సేకరిస్తాడు.

ఫోన్ నెంబర్ ఇచ్చిన మహిళలకు అభ్యంతరకర సందేశాలు పంపుతూ వేధిస్తాడు. ఇటీవల కొన్నిరోజుల వ్యవధిలోనే ఇద్దరు మహిళలు వీరబాబుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్, సైఫాబాద్ పీఎస్ లలో ఫిర్యాదులు దాఖలయ్యాయి. దాంతో పోలీసులు ఆ టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ ను అరెస్ట్ చేశారు. అతడిపై ఐపీసీ 354, ఐపీసీ 509 సెక్షన్లతో కేసు నమోదు చేశారు.