ఉల్లాసంగా, ఉత్సాహంగా... దర్శకేంద్రుడి సైక్లింగ్

12-07-2020 Sun 19:09
  • తన ఇంటి ఆవరణలో సైకిల్ తొక్కిన దర్శకేంద్రుడు
  • రాఘవేంద్రరావును ఫాలో అయిన పెంపుడు శునకం
  • నమ్మదగిన నేస్తం అంటూ ట్వీట్
Raghavendra Rao cycling in his house

కరోనా వ్యాప్తి నేపథ్యంలో సినీ ప్రముఖులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అక్కడక్కడా షూటింగ్ లు మొదలైనా మునుపటి ఊపు లేదు. ఈ నేపథ్యంలో, సెలబ్రిటీలు ఆసక్తికరమైన పోస్టులతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. తాజాగా, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఎంచక్కా సైక్లింగ్ చేస్తున్నారు.

దీనికి సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. కుర్రాడి మాదిరే టీషర్ట్, షార్ట్స్ ధరించిన ఆయన తన ఇంటి ఆవరణలో సైకిల్ తొక్కుతూ ఆస్వాదించారు. ఆయన వెనుకే పెంపుడు శునకం కూడా పరుగులు తీస్తూ కనిపించింది. దీనిపై రాఘవేంద్రరావు స్పందిస్తూ, "ఈ ప్రపంచం మనకు ప్రసాదించగలిగిన దాంట్లో ఉత్తమమైనవి ప్రకృతి, దేహదారుఢ్యం, నమ్మదగిన నేస్తం" అంటూ ట్వీట్ చేశారు.