ఐశ్వర్యరాయ్, కుమార్తె ఆరాధ్యకు కరోనా పాజిటివ్

12-07-2020 Sun 15:04
  • ఇప్పటికే అమితాబ్, అభిషేక్ లకు కరోనా పాజిటివ్
  • తొలి టెస్టులో ఐశ్వర్య, ఆరాధ్యలకు నెగెటివ్
  • రెండో టెస్టులో కరోనా వెల్లడి
  • జయా బచ్చన్ కు నెగెటివ్!
Aishwarya Rai and Aradhya tested corona positive

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కుటుంబంలో కరోనా కలకలం రేగింది. ఇప్పటికే అమితాబ్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ కరోనా బారినపడ్డారు. తాజాగా, అభిషేక్ అర్ధాంగి ఐశ్వర్య రాయ్, కుమార్తె ఆరాధ్యలకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ ఉదయం ఐశ్వర్య, ఆరాధ్యలకు తెమడ పరీక్ష చేయగా నెగెటివ్ వచ్చిందని ముంబయి నగర మేయర్ కిశోరి పెడ్నేకర్ తెలిపారు. అయితే, రెండో టెస్టులో వారిద్దరికీ పాజిటివ్ వచ్చిందని బృహన్ ముంబయి కార్పొరేషన్ (బీఎంసీ) కమిషనర్ వెల్లడించారు.

ఇక, అమితాబ్ అర్ధాంగి జయా బచ్చన్ కు యాంటీజెన్ టెస్టులో నెగెటివ్ వచ్చినట్టు తెలిసింది. అమితాబ్ కుటుంబంలో పలువురికి కరోనా సోకడంతో వారి నివాస భవనం 'జల్సా'ను బీఎంసీ అధికారులు మూతవేసి శానిటైజ్ చేశారు. కాగా, అమితాబ్, అభిషేక్ ముంబయిలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.