Doctor: ఓ ప్రభుత్వ వైద్యుడి అతి తెలివి... భార్య కరోనా శాంపిళ్లను పనిమనిషి పేరుతో పంపాడు!

  • సెలవు దొరక్కపోయిన పెళ్లికి వెళ్లిన వైద్యుడు
  • క్వారంటైన్ లో ఉండకుండా విధులకు హాజరు
  • భార్యలో కరోనా లక్షణాలు
  • వైద్యుడిపై కేసు నమోదు
Government doctor cheats officials in Madhyapradesh

మధ్యప్రదేశ్ లో ఓ ప్రభుత్వ వైద్యుడు అతి తెలివి ప్రదర్శించాడు. సింగ్రౌలీ ప్రాంతంలో గవర్నమెంట్ ఆసుపత్రిలో డాక్టర్ గా పనిచేస్తూ నిబంధనలు ఉల్లంఘించాడు. అధికారులు సెలవు ఇవ్వకపోయినా సరే ఉత్తరప్రదేశ్ లోని ఓ పెళ్లికి వెళ్లొచ్చాడు. నిబంధనలను అనుసరించి హోం క్వారంటైన్ లో ఉండాలి... కానీ విధులకు హాజరయ్యాడు. ఇంతలో ఆయన భార్యలో కరోనా లక్షణాలు కనిపించాయి.

ఆమెకు కరోనా టెస్టులు చేయిస్తే తాను ఉత్తరప్రదేశ్ వెళ్లిన సంగతి బయటపడుతుందని అతి తెలివి ప్రదర్శించి... భార్య కరోనా శాంపిళ్లను పనిమనిషి పేరుతో ల్యాబ్ కు పంపాడు. అయితే, ఆ శాంపిల్స్ పరీక్షించగా, కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో అధికారులు ఆ పనిమనిషి చిరునామా వెతుక్కుంటూ వెళ్లారు. ఆ పనిమనిషిని ప్రశ్నించగా, డాక్టర్ నిర్వాకం బయటపడింది.

ఆపై, ఆ ఇంట్లో అందరికీ కరోనా టెస్టులు చేయగా, డాక్టర్ కే కాదు మరో ఇద్దరు కుటుంబ సభ్యులకు కూడా పాజిటివ్ వచ్చింది. ఈ క్రమంలో, క్వారంటైన్ రూల్స్ ఉల్లంఘించి, వేరే పేరుతో శాంపిళ్లు పంపాడంటూ ఆ వైద్యుడిపై అంటురోగాల చట్టం కింద కేసు నమోదు చేశారు.

More Telugu News