Venkaiah Naidu: దూసుకెళుతున్నాం అని భ్రమపడిన సమయంలో కనిపించకుండా కరోనా ప్రవేశించింది: వెంకయ్యనాయుడు

  • జీవితాన్ని రీసెట్ చేసిందన్న ఉపరాష్ట్రపతి
  • జీవితాన్ని భేరీజు వేసుకుని ముందుకు సాగాలని పిలుపు
  • ఇదొక సంధి కాలం అని వెల్లడి
Venkaiah Naidu says corona hits the pause button of human life

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తాజా పరిస్థితులపై తాత్విక రీతిలో స్పందించారు. మానవుడి ఆధునిక జీవితం ఎంతో సాఫీగా దూసుకెళుతోంది అని భ్రమపడుతున్న వేళ... జీవితంలోకి కనిపించకుండా కరోనా వైరస్ వచ్చిందని తెలిపారు. పాజ్ బటన్ నొక్కినట్టుగా జీవితాన్ని ఆపేసిందని, రీసెట్ బటన్ ద్వారా పునఃప్రారంభాన్ని కూడా చూపించిందని పేర్కొన్నారు. సరిగ్గా చెప్పాలంటే రెండు జీవన విధానాల మధ్య ఇదొక సంధి కాలం అని అభివర్ణించారు.

మానవ జీవితం ఒక్కసారిగా నిలిచిపోయిందని, కరోనా సమయంలో ఏం నేర్చుకున్నామన్నదానిపై భవిష్యత్ పునాదులు లేస్తాయని వివరించారు. "ఆంగ్లంలో ఓ సామెత ఉంది. బి (బర్త్) నుంచి డి (డెత్) వరకు సాగేదే జీవితం. మధ్యలో సి (చాయిస్ లు) జీవితం తీరుతెన్నులను నిర్ణయిస్తుంది. ప్రముఖ తత్వవేత్త సొక్రటీస్ ఏంచెప్పాడో చూడండి... సవాళ్లు ఎదుర్కోని జీవితం నిజమైన జీవితమే కాదన్నాడు. ఎలా జీవిస్తున్నామన్నదానిపై ఇప్పటివరకు సమీక్షించుకునే అవకాశం మనకు రాలేదు. కానీ కరోనా రూపంలో ఆ అవకాశం మన ముంగిట నిలిచింది. ఇప్పటికైనా జీవితాన్ని భేరీజు వేసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరాన్ని కరోనా చాటిచెబుతోంది" అంటూ వివరించారు.

More Telugu News