TTD: టీటీడీలో కరోనా విజృంభణ... 91 మందికి పాజిటివ్

Corona scares looming over TTD and Tirumala
  • తిరుమల క్షేత్రంలో కరోనా కలకలం
  • అలిపిరి, తిరుమలలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామన్న ఈవో
  • భక్తులెవరికీ సోకలేదని వెల్లడి
కరోనా మహమ్మారి సర్వాంతర్యామిలా ఎక్కడ చూసినా ప్రత్యక్షమవుతోంది. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలోనూ కలకలం రేపుతోంది. టీటీడీలో 91 మంది ఉద్యోగులకు కరోనా సోకిందని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు.అలిపిరి వద్ద, తిరుమలలోనూ టీటీడీ ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించామని, పెద్ద సంఖ్యలో యాత్రికులకు కూడా కరోనా టెస్టులు చేపట్టామని తెలిపారు.  అయితే భక్తులెవరికీ కరోనా సోకలేదని స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న వారిలో 30 శాతం మంది తిరుమల యాత్ర రద్దు చేసుకున్నారని చెప్పారు.

కాగా, టీటీడీ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయించినట్టు సింఘాల్ తెలిపారు. తద్వారా వివాదాలకు తావు ఉండదని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. అంతేకాదు, ఈసారి స్వామివారి బ్రహ్మోత్సవాల నిర్వహణకు టెండర్లు పిలుస్తున్నామని, అయితే అప్పటి పరిస్థితుల ఆధారంగా తుది నిర్ణయం ఉంటుందని చెప్పారు.
TTD
Corona Virus
Positive
Tirumala
Pligrims

More Telugu News